Welcome to Babunanna & Janaki's family pages

Namaste & Greetings:

This blog has been created by the children of Sri Chitrapu Suryanarayana Murty and Smt. Janaki Devi in order to preserve the wonderful memories that have been created.

Thank you for visiting and contributing.

Sarve Jana Sukhino Bhavanthu (May all the people be happy)

February 24, 2010

శ్రీ చాగంటి సుబ్రహ్మణ్యం మావయ్య నుంచి ఒక చిన్న మాట

మీ తల్లి తండ్రులు గురించి తెలియ చెప్పటానికి నేను ఎంత వాడను? నాకు తెలిసింది ఎంత? అయిన నా దృక్కోణంలో మా అక్క బావలు అన్నది చెప్తా.
ఆ పుణ్య దంపతలు ఇద్దరినీ మొట్టమొదట నా చిన్నప్పుడు చూసాను. అప్పుడు నా వయసు చాల తక్కువ. అందరి పిల్లలాగే నేను కూడా ఆటలతో కాలం గడిపే వాడిని.
కూతురు అల్లుడు వస్తున్నారని ఇంట్లో అంత హడావడి పడుతూంటే, నేను మటుకు నా లోకంలో ఉన్నాను. వాళ్ళు వచ్చాక కూడా నా గురుంచి అసలు ఎవ్వరు పట్టించు కున్నారు అప్పుడు !!
మిట్ట మధ్యానం బావి దగ్గర నా మాన్నాని నేను బంక మట్టితో బొమ్మలు చేసుకున్తోంటే, అకస్మాత్తుగా నన్ను కసుర్తూ ఒక గద్దింపు వినిపించింది, వెంటనే నేను చేసుకుంటున్న బొమ్మలు నూతి పాలు అయ్యాయి,
తితిరి చూస్తె ఆ మహానుభావుడు మా బావగారు, నాకు చాల కోపము, దుఖము రెండు వచ్చాయి. నా బొమ్మలు మట్టిపాలు అయ్యినందుకు నాకు చేతనైనంత తిరగ బడ్డ. ఆయనికి ఇంట్లో అల్లుడిగా ఒక స్థానం ఉంటె, నాకు మా ఇంట్లో ఒక స్థానం ఉండేది
- మా ఇంట్లో నేను అంటే అందరకి భయం - నాకు కోపం ఎక్కువని.
ఆ రోజు ఆయన మా నాన్నగారికి నేను కాలం వృధా చేస్తున్నాను అని చెప్పారు.
ఆ నాడు బావి వద్ద ఆ రూపం, ఆ మాట నాలో కొంచెం భయం పుట్టించాయి. తర్వాత ఆ భయం మెల్లగా గౌరవం, ప్రేమగా మారాయి.

Same telugu version in English, contributed by Sri Chaganty Subrahmanyam - younger brother of Smt C.Janaki Devi:

mee parents gurinchi teliya cheppataniki nenu entha vadanu?naku telisindi entha?? ayina naa drukkonam lo maa akka bavalu annadi chepta.
aa punya dampatulu iddarni mottamodata naa chinnapudu chusa.appudu naa vayasu chala takkuva.andari pillala lage nenu kuda aatala tho kaalam gadipe vadini.kuturu alludu vastunnarani intlo antha hadavdi undi.nenu matuku naa lokamulo unna,vaallu vachaka kuda.naagurunchi asalu evaru pattinchu kunnaru appudu !!i was busy in clay moulding.ante banka matti tho bommalu chesukuntunna,nuuti daggira.at noon time,calm gaa.sudden ga oka gaddimpu vinpinchindi,nannu kasurutuu.ventane nenu chetunna bommalu nuuti palu ayya yi.tirigi chuste aa mahanubhavudu,maa bavagaru.naaku chala kopam vachindi.edupu kuda,naa bommalu matti palu ayinanduku.nenu kuda takkuva tina ledu.naaku chetanayinantha varaku tiraga badda.ofcourse matalatho.or koncham next version tho.
aayana position aayanaku unte nakuu o position undedi maa intlo.nenu ante andaruu bhaya pade varu.naku kopam ekkuva ani.so,then he made a complaint to my father,that i was wasting time with mud , in the hot sun.tatruvata antha mamule.aa figure,aa maata naku koncham bhayam puttindi appatlo.aa bhayam taggi gouravam prema puttayi taruvata taruvata.

1 comment:

  1. hi lappi,

    looks great......reads even better
    good job sweetie
    wwp

    ReplyDelete